
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని శేఖాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ సెట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఉపాధి కూలీలకు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ ల గురించి వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి కూలీలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.