ఎన్నికలల్లో ఘర్షణలకు యువత దూరంగా ఉండాలి

– నేరాలు అరికట్టడంలో ప్రజాప్రతినిధులు సహకరించాలి సీఐ కాశీవిశ్వనాథ్‌
– రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆరుట్ల సర్పంచ్‌ కొంగర విష్ణువర్ధన్‌ రెడ్డి
నవతెలంగాణ-మంచాల
ఎన్నికలల్లో జరిగే ఘర్షణలకు యువత దూరంగా ఉండాలని సీఐ కాశీవిశ్వనాథ్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో మంచాల పోలీస్‌ వారి ఆధ్వర్యంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం సర్పంచ్‌ కొంగర విష్ణువర్ధన్‌ రెడ్డి అధ్యక్షన నిర్వ హించిన సమావేశంలో గ్రామాల్లో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యక్రమాలపై చర్చించారు. ‘మద్యానికి, ఎన్నిక లల్లో జరిగే ఘర్షణలకు యువత దూరంగా ఉండాలనీ, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు.
సర్పంచ్‌ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ యువత మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసలై,ౖ ఓవర్‌ స్పీడ్‌ వెళ్లుతూ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ సతీష్‌, ఎంపీటీసీ చీరాల రమేష్‌, ఉపసర్పంచ్‌ పాండాల జంగయ్య గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, వార్డు సభ్యులు పి. శివకుమార్‌, ఎం.వెంకటేష్‌, కె.మల్లేష్‌, ఏ.స్వప్న సురేష్‌, ఎన్‌.మమత మల్లేష్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఎండీ జానీ పాషా, ఎస్‌ఎంసీ చైర్మెన్‌ నూకం రాజు, మాజీ ప్రజాప్రతి నిధులు నూకం సత్తయ్య, అనం గళ్ళ యాదయ్య, లాలగారి శ్రీకాంత్‌, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

Spread the love