హైదరాబాద్ : కాటన్ సీడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోని శ్రీరామ్ ప్రోటీన్స్ లిమిటెడ్‌కు 63,277 మెట్రిక్ టన్నుల పత్తికి ఎగమతి ఆర్డర్ దక్కినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలపింది. ఈ ఆర్డర్ నుండి కంపెనీకి రూ.50 నుండి 60 కోట్ల ఆదాయం రానుందని తెలిపింది. చైనాలోని షాంఘైకి 63277.20 మెట్రిక్ టన్నుల 100 శాతం కాటన్ నూలు ఎన్‌ఈసీసీహెచ్ 32ను ఎగుమతి చేయడానికి ఆర్డర్‌ను పొందినట్లు ప్రకటించింది. దీని ఫలితంగా వార్షిక లాభాల్లో 6 శాతం పెరుగొచ్చని అంచనా వేసింది.