మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకుడి పరామర్శ

నవతెలంగాణ-వీణవంక
మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గట్టు సమ్మయ్య, తాళ్లపల్లి కాంతమ్మలు ఇటీవల మృతి చెందారు. కాగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ యువజన నాయకుడు వొడితల విప్లవ్ సోమవారం మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నర్సయ్య, వార్డు సభ్యుడు చింతల రాజయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య, బీఆర్ఎస్ నాయకుడు పోతుల సురేష్, గ్రామస్తులు కటుకోజుల సంపత్ కుమార్, కొమిరె రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love