కార్మిక సంఘాల ఐక్యతతో మెరుగైన వేతన ఒప్పందం

– మంద నరసింహారావు
నవతెలంగాణ-మణుగూరు
కార్మిక సంఘాల ఐక్యతతో మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు తెలిపారు. గురువారం ఓసి టు పిక్‌ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడుతూ 19 శాతం జీతం పెరుగుదల, 24శాతం అలవెన్స్‌ల పెరుగుదల సాధ్యమైందన్నారు. అండర్‌ గ్రౌండ్‌ డెలివెంట్స్‌ స్పెషల్‌ ఎలిమెంట్స్‌ హెచ్‌ఆర్‌ఏ ఫ్రీజింగ్‌తో 85శాతం పెరుగుదల వల్ల కార్మికులకు మేలే జరిగిందన్నారు. హెచ్‌ఎంఎస్‌ లాంటి సంఘం అగ్రిమెంట్‌లో సంతకం పెట్టి మిగతా ఈ నెల ప్రోత్బలంతో పెట్టినట్లుగా కార్మికులకు అన్యాయం జరిగినట్లుగా మాట్లాడటం శోచనీయమని అన్నారు. ఇట్లాంటి ద్వంద వైఖరిని మానుకోవాలని కార్మికులకు వాస్తవాలు చెప్పాలని అన్నారు. అబద్ధాలు చెప్పి పబ్బం కడుక్కోవటం సరైనది కాదని విమర్శించారు. కార్మికులకు గతంలో అనేక నష్టాలు చేసినటువంటి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసిన యూనియన్‌ ఇట్లా మాట్లాడడాన్ని కార్మికుల అర్థం చేసుకోవాలని కోరారు. అలాగే దిగిపోయిన కార్మికుల పెన్షన్‌ మెడికల్‌ స్కీము సవరించుకోవాలని సీఐటీయూ కృషి చేసిందన్నారు. మేనేజ్మెంట్‌ పెన్షన్‌ ట్రస్ట్‌ బోర్డులో పెన్షన్స్‌ గురించి మెడికల్‌ ట్రస్ట్‌ బోర్డులో మెడికల్‌ గురించి మాట్లాడుకుందాం అని అగ్రిమెంట్లో రాసుకున్న తర్వాతనే సీఐటీయూ ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కాంటాక్ట్‌ కార్మికుల హైపర్‌ కమిటీ వేతనాలు విషయంలో సబ్‌ కమిటీలో మాట్లాడి అమలు చేసుకుందామని అన్నారు. కోల్‌ ఇండియా మేనేజ్మెంట్‌ చెప్పింది అలాగే వాటిని సింగరేణిలో అమలు చేయాలని అన్ని యూనియన్లతో పాటు సీఐటీయూ కూడా పట్టు పట్టిందన్నారు. నేపథ్యంలో సింగరేణి యాజమాన్యానికి కోల్‌ ఇండియా యజమాన్యం అమలు కోసం లెటర్‌ రాస్తానని హామీ ఇచ్చిందని తెలియజేశారు. కాబట్టి కార్మికులు జీతాలు పదివేల నుండి 25 వేల వరకు నెలకు పెరిగిన అంశాన్ని ఈ పెరిగిన జీతాలు జూన్‌ నెల నుంచి పేమెంట్‌ చేయటానికి మేనేజ్మెంట్‌ ప్రయత్నం చేస్తుందని ఒకవేళ సాధ్యం కాని పరిస్థితిలో జులై నెల కొత్త జీతం పేమెంట్‌ చేయటానికి అంగీకరించిందని తెలియజేశారు. అలాగే ఏరియర్స్‌ సంబంధించి ఏ కంపెనీకి ఆ కంపెనీతో విడిగా మాట్లాడుకుని పేమెంట్‌కి సూచన చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్‌ అధ్యక్ష కార్యదర్శులు టీవీ ఎన్‌వి ప్రసాద్‌, వల్లూరి వెంకటరత్నం, సీనియర్‌ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, మాచారపు లక్ష్మణరావు, వై.రామ్మూర్తి, నందం ఈశ్వరరావు, వెంకటేశ్వర్లు, విల్సన్‌, రాంబరోస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love