గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో హిట్ అండ్ రన్ కేసు

నవతెలంగాణ – హైదరాబాద్: గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో ఓ హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్: గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో ఓ హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. స్వీఫ్ట్ డిజైర్ కారు ఓ బాలుడిని ఢీ కొట్టింది. కారు నడిపిన సూడాన్ దేశస్తుడు. అనంతరం కారుతో పాటు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు కారును పట్టుకున్నారు. కోపాద్రిక్తులైన వారు కారును ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారు నడిపి బలుడుని ఢీ కొట్టిన సూడాన్ దేశస్తుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Spread the love