జీ20 సదస్సులో కరీంనగర్ సిల్వర్‌ ఫిలిగ్రికి అవకాశం

నవతెలంగాణ – ఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ సమాయత్తమైంది. ఢిల్లీ వేదికగా రేపటి నుంచి రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అగ్రదేశాల అధినేతలు ఢిల్లీ వస్తున్నందున హస్తినలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఢిల్లీలో శని, ఆదివారాల్లో జరగనున్న జీ20 సదస్సుకు హాజరవుతున్న ప్రపంచ దేశాల అతిథులు సిల్వర్‌ ఫిలిగ్రి అశోక చక్ర బ్యాడ్జీని ధరించనున్నారు. ఈ బ్యాడ్జీని తయారు చేసే అవకాశం కరీంనగర్‌ కళాకారుడు ఎర్రోజు అశోక్‌కు దక్కింది. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు హజరవుతున్నారు. వీరు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి కళాకారుడు ఎర్రోజు అశోక్‌ రూపొందించిన అశోక చక్ర ఆకారంలో ఉన్న వెండి బ్యాడ్జీలను ధరించనున్నారు. మొత్తం 200 వెండి బ్యాడ్జీలను ఇక్కడి నుంచి తరలించారు. ఈ సమావేశాలు జరిగే చోట కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి స్టాల్‌కు అనుమతి ఇచ్చారు.

Spread the love