జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లపై కె.ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈనెల 24న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా డైరెక్టర్ కొరటాల శివ ‘రాజు యాదవ్’ నుంచి ఫీల్ మై స్మైల్ సాంగ్‌ని లాంచ్ చేసి, యూనిట్‌కి అభినందనలు తెలిపారు. స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని ఫీల్ గుడ్ మెలోడీ నెంబర్‌గా కంపోజ్ చేశారు. కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. యశస్వి కొండేపూడి తన లవ్లీ వాయిస్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. రాజు యాదవ్.. లవ్, కామెడీతో పాటు హదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో అలరించనుంది. ఇక ఇందులో రాజుయాదవ్గా గెటప్ శ్రీను తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. ఇటీవల ఈచిత్ర టీజర్‌ని చూసిన చిరంజీవి సైతం గెటప్ శ్రీను నటన గురించి అభినందించారు.
గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కళ్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం: కష్ణమాచారి. కె, నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, డీవోపీ: సాయిరామ్ ఉదరు, సాహిత్యం: చంద్రబోస్, కాసర్ల శ్యామ్, ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగేళా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విప్లవ్, గాయకులు: చంద్రబోస్, రామ్ మిరియాల, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, యసస్వి కొండేపూడి, కొరియోగ్రఫీ: జిత్తు మాస్టర్.