మెప్పించే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

మెప్పించే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌”బేబి” వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత హీరో ఆనంద్‌ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా ”గం..గం..గణేశా”. ఈ సినిమాను హై-లైఫ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదరు శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్‌ దేవరకొండ తన కెరీర్‌లో చేస్తున్న ఫస్ట్‌ యాక్షన్‌ మూవీ ఇది కావడం విశేషం. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఈనెల 31న సినిమాను గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. సరికొత్త కంటెంట్‌తో ఈ సమ్మర్‌లో అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఈ సినిమా ఎంటర్‌టైన్‌ చేయనుందని, ఈ సమ్మర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ మూవీ అవుతుందనే నమ్మకాన్ని మేకర్స్‌ వ్యక్తం చేశారు. ఆనంద్‌ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్‌, జబర్దస్త్‌ ఇమాన్యూయల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : పూజిత తాడికొండ, ఆర్ట్‌: కిరణ్‌ మామిడి, ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి, సంగీతం – చేతన్‌ భరద్వాజ్‌, కొరియోగ్రఫీ: పొలాకి విజరు,
కో-ప్రొడ్యూసర్‌ -అనురాగ్‌ పర్వతనేని

Spread the love