మెప్పించే టక్కర్‌

హీరో సిద్ధార్థ్‌ త్వరలోనే ‘టక్కర్‌’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, పాషన్‌ స్టూడియోస్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.
‘సాధారణంగా సిద్ధార్థ్‌ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠను రేపేలా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రొమాన్స్‌, యాక్షన్‌ మేళవింపుతో రూపొందిన ఈ టీజర్‌ సినీ ప్రియుల దష్టిని ఆకర్షించింది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’, ‘పెదవులు వీడి మౌనం’ పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. కథానాయిక స్వభావాన్ని తెలియజేసేలా, ప్రకతి అందాల నేపథ్యంలో చిత్రీకరించిన ‘కయ్యాలే’ పాట కట్టిపడేసింది. నాయకానాయికల ఘాటు ప్రేమను తెలిపేలా సాగిన ‘పెదవులు వీడి మౌనం’ పాట మనసు దోచేసింది. ఇలా పాటలు, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. ఈ చిత్రంతో సిద్ధార్థ్‌ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి.
ఈ రొమాంటిక్‌ యాక్షన్‌ రైడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించి, సిద్ధార్థ్‌ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో అభిమన్యు సింగ్‌, యోగి బాబు, మునీశ్‌ కాంత్‌, ఆర్జే విజ్ఞేశ్‌ కాంత్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Spread the love