అప్పులతో విత్తనాలు ఎరువులు కొనుగోలు చేస్తున్న రైతన్న..

– ప్రభుత్వం అందించే రైతుబంధు కోసం ఎదురుచూపులు
– పెట్టుబడి సహాయం అంటారు సమయానికి అందించరు
– చినుకు పడితే పంట సాగు కోసం రైతన్న సిద్ధం
నవతెలంగాణ – మద్నూర్
ఖరీఫ్ పంటల సాగు ఆసన్నమైనందున రైతన్న ఎరువులు విత్తనాలు అప్పులతో కొనుగోలు చేస్తూ సాగు కోసం సిద్ధమవుతున్నారు మద్నూర్ ఉమ్మడి మండలంలో మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలో ఖరీఫ్ సాగులో భాగంగా సోయా పంటను రైతులు అత్యధికంగా సాగు చేస్తారు జూన్ రెండో వారం కొనసాగుతున్నందున ఖరీఫ్ సాగు ఆసన్నమైందని చినుకు పడితే విత్తు అలుకడానికి రైతన్నలు అప్పులు చేస్తూ సోయా విత్తనాలు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతన్న అప్పులు చేసుకోకుండా పెట్టుబడి సహాయం కింద రైతుబంధు పథకాన్ని అమలు పరుస్తూ ఎకరాకు ఖరీఫ్ సాగుకు 5000 రూపాయల చొప్పున ఆ తర్వాత రబ్బి పంట సాగు ఎకరాకు 5000 రూపాయలు చొప్పున మొత్తం రెండు విడతల్లో ఎకరాకు పదివేల రూపాయలు పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది పెట్టుబడి కోసం రైతన్న అప్పులు చేయక తప్పడం లేదు ఎందుకంటే జూన్ మొదటి వారం నుండి వర్షాలు పడగానే పంట సాగు చేస్తారు. ప్రస్తుతం జూన్ రెండో వారం కొనసాగుతోంది వర్షం పడగానే పంట సాగు ప్రారంభిస్తారు. మద్నూర్ ఉమ్మడి మండలంలో మొత్తం దాదాపు 22 వేల మంది వ్యవసాయ రైతులు ఉన్నట్లు వ్యవసాయ అధికారి అంచనాల ప్రకారం తెలుస్తోంది. ఈ రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సహాయం కింద దాదాపు 25 కోట్లు అవసరంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ మొదటి వారంలో పెట్టుబడి సహాయం అందిస్తే గాని రైతన్న అప్పులు చెయ్యకుండా ఉండగలడు జూన్ రెండో వారం గడుస్తున్న ప్రభుత్వ పెట్టుబడి సహాయం అందకపోవడం అప్పుల కోసం పరుగులు తీస్తూ రైతన్న ఎరువులు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వానాకాలం పంట సాగు కోసం జూన్ మొదటి వారంలోని పెట్టుబడి సహాయం అందిస్తే రైతులకు అప్పులు తప్పుతాయి రెండో వారం గడిచిన పెట్టుబడి సహాయం కోసం రైతన్న ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు విత్తనాలు ఎరువులు లభిస్తాయో లేదో మార్కెట్లో రోజురోజుకు ధరలు ఏ విధంగా పెరుగుతాయోనని అయోమయంలో రైతన్న అప్పులు చేయక తప్పడం లేదు రాత్రి వర్షం కురిస్తే ఉదయమే పంట సాగు కోసం రైతన్న సిద్ధం అయ్యారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయం మాత్రం ఇప్పటికీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ విషయాన్ని కూడా వ్యవసాయ అధికారులకు అడిగి తెలుసుకున్న పెట్టుబడి సహాయం అందించే టైం బాండ్ ఇంకా ప్రభుత్వం నుండి రాలేదని తెలుస్తోంది. ఈనెల 22 వరకు దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిలోనే బిజీగా ఉంది రైతు పెట్టుబడి సహాయానికి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తుందో అవి రైతన్న ఖాతాల్లో ఎప్పుడు జమవుతాయో తెలియని పరిస్థితి ఏది ఏమైనా ముఖ్యమంత్రి మాట రైతన్న అప్పు చెయ్యకూడదనేది రైతుబంధు పథకం కానీ ఆ పథకం డబ్బులు జూన్ మొదటి వారంలోనే అందించాలి లేకపోతే రైతన్న అప్పు చేయక తప్పడం లేదు వడ్డీలతో లేదా అధిక ధరలతో రైతన్న విత్తనాలు ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతుబంధు పథకం డబ్బులు వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ రైతులు ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు.

Spread the love