నవతెలంగాణ-మునిపల్లి
గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతులు.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకా లు మొదలగు అంశాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ శైలజ అధ్యక్షతన నిర్వహించగా.. సాదాసీదాగా సాగింది. సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను, అభివద్ధి గురించి సర్పంచులు, ఎంపీటీసీలు సభ దష్టికి తీసుకువచ్చారు, వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతిని ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ప్రగతి నివే దికను చదివి వినిపించారు. అధికారుల గైర్హాజరుపై కలెక్టర్ దష్టికి తీసుకెళ్తామని.. సర్వసభ సమావేశానికి ప్రతి అధికారి హాజరుకావాలని ఎంపీడీఓ అన్నారు. కంకోల్, చిల్లపల్లి, మునిపల్లి సర్పంచులు తమ గ్రామాల సమస్యలను సభ దష్టికి తీసుకువచ్చారు. రోజుల తరబడి తహసీల్దార్ కార్యాల యం చుట్టూ తిరిగినా.. బర్త్ సర్టిఫికేట్ సమయానికి రావడం లేదన్నారు. కాగా ఈ సమస్యను పరిష్కరిస్తానని తహసీల్దార్ మామీ ఇచ్చారు. మల్లికార్జున పల్లి ఎంపీటీసీ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు, ఇండ్ల స్థలాలను ఇచ్చేటప్పుడు గ్రామాల్లో సభపెట్టి నిరుపేదలకు లబ్ది చేకూరే లా చూడాలన్నారు. కంకోల్ సర్పంచ్ విశ్వనాథం మాట్లాడు తూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో భూములు కోల్పోయిన బాధితులకు కొందరికి చెక్కులు వచ్చినా.. ఇంకా చాలా మందికి రాలేదని దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రన్నారు. చీలపల్లి సర్పంచ్ వీరన్న మాట్లాడుతూ.. తాటిపల్లి నుంచి చీలపల్లి వరకు రోడ్డు పరిస్థితి బాగోలేదని త్వరగా బాగు చేయాలని కోరారు. కాగా త్వరలోనే పరిష్కారానికి కషి చేస్తామని ఏఈ సమాధానం ఇచ్చారు. జెడ్పీటీసీ మీనాక్షి, తహసీల్దార్ తెన్మోలి, ఎంపీడీవో హరి నందన్ రావు, వైస్ ఎంపీపీ కమ్రుద్దీన్, ఎంపిఓ అంజలీదేవి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్ పాల్గొన్నారు.