మణిపూర్‌కు వామపక్షపార్టీల ఎంపీల బృందం

– నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటన
– హింసపై అధ్యయనం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మణిపూర్‌లో మే 3న చెలరేగిన హింసాకాండ నేటికీ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను అధ్యయం చేసేందుకు సీపీఐ(ఎం), సీపీఐ ఎంపీల బృందం పర్యటించ నుంది. మణిపూర్‌ ప్రజలకు సంఘీ భావం తెలిపేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేం దుకు, శాంతి భద్రతల పునరుద్ధరణ కోసం అధికారులతో మాట్లాడేందుకు (జులై 6 నుంచి 8 వరకు) మూడు రోజుల పాటు సీపీఐ(ఎం), సీపీఐకు చెందిన ఐదుగురు ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం పర్యటించనుంది. ప్రతినిధి బృందం చురచంద్‌పూర్‌, ఇంఫాల్‌ లోయలో అన్ని జాతుల ప్రజలను కలుస్తుంది. 7న సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలవనున్నది. 8న మీడియాతో సమావేశమై తమ అనుభవాలను వివరించనున్నది. ప్రతినిధి బృందంలో సీపీఐ(ఎం) పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు బికాష్‌ రంజన్‌ భట్టాచార్య, జాన్‌ బ్రిట్టాస్‌, సీపీఐ నుంచి రాజ్యసభ ఎంపీలు బినోరు విశ్వం, పి. సంతోష్‌ కుమార్‌, సీపీఐ నుంచి లోక్‌సభ ఎంపీ కె. సుబ్బరాయన్‌ ఉన్నారు.

Spread the love