కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

– 8 మంది కార్మికులు మృతి
– 60 మందికి గాయాలుమహారాష్ట్ర థానేలో ఘటన
థానే (మహారాష్ట్ర): మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. థానే సమీపంలోని డొంబ్లివిలోని ఎంఐడీసీ ప్రాంతంలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలోని బాయిలర్‌లో గురువారం అమాంతంగా.. మంటలు చెలరేగాయి. అనంతరం భారీ పేలుడు సంభవించడంతో 8 మంది కార్మికులు మృతి చెందారు. 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైర్‌ ఇంజన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన, మంటల్లో చిక్కుకున్న వారి గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Spread the love