అందర్నీ మెప్పించే పతంగ్‌

అందర్నీ మెప్పించే పతంగ్‌ఇప్పటి వరకు భారతీయ సినిమాల్లో ఎన్నో స్పోర్ట్స్‌ డ్రామాలు ప్రేక్షకులు చూసి ఉంటారు. కానీ తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘పతంగ్‌’. సినిమాటిక్‌ ఎలిమెంట్స్‌ అండ్‌ రిషన్‌ సినిమాస్‌ పతాకంపై విజరు శేఖర్‌ అన్నే, సంపత్‌ మక, సురేష్‌ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్‌ ప్రత్తిపాటి దర్శకుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్‌ సెన్సేషన్‌ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్‌ ప్రణవ్‌ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్‌ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. నటుడు ఎస్‌పీ చరణ్‌ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్ర టీజర్‌ను ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో జరిగిన వేడుకలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా టీజర్‌ను విడుదల చేశారు. మరో అతిథి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఈ సినిమా కాంటెస్ట్‌లో విజేతలకు బహుమతులను అందజేశారు. దర్శకుడు ప్రణీత్‌ మాట్లాడుతూ,’సినిమా టీజర్‌ నచ్చితే అందరికి సినిమా నచ్చినట్టే. ఒక తెలుగు కమర్షియల్‌ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్‌ ఉన్నాయి. తప్పకుండా సినిమా నచ్చుతుంది. టీజర్‌లో చెప్పినట్లుగా మ్యాచ్‌లో కలుద్డాం’ అని అన్నారు. ‘ఈ సినిమా చాలా వ్యయ ప్రయాసాలతో జరిగింది. ఈ గాలిపటం దారం తెగకుండా చూసుకున్నాడు నాని. ఈ రోజు సినిమా బాగా రావడానికి టీమ్‌ అంతా కషి చేశారు. టీజర్‌లో వున్నట్లు అందరూ మ్యాచ్‌ కోసం ఈసినిమా మళ్లీ మళ్లీ చూస్తారు’ అని నిర్మాత సంపత్‌ మక చెప్పారు. క్రియేటివ్‌ నిర్మాత నాని బండెడ్డ్రి మాట్లాడుతూ,’తప్పకుండా ఈ సినిమా అందర్ని ఎంటర్‌టైన్‌చేస్తుంది. ఈ సినిమా థియేటర్స్‌లో యూత్‌ఫెస్టివల్స్‌ జరుగుతాయి’ అని తెలిపారు.

Spread the love