బైకును ఢీ కొట్టిన కారు..చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

– మరొక వ్వక్తి మధు ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింవు
నవతెలంగాణ -పెద్దవూర
వేగంగా వస్తున్నకారు బైకు పై వస్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన సంఘటన లో బైకుపై వస్తున్న వ్యక్తికి గాయాలై చికిత్స పోందుతూ అతను మృతి చెందిన సంఘటన మండల కేంద్రం లోని విశ్వనాథ కాటన్ మిల్లు సమీపంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమల్గిరి సాగర్ మండలం బోయగూడెం గ్రామానికి చెందిన గోపి, మరియు మధు అను ఇద్దరు వ్యక్తులు బోయగూడెం నుండి కొండమల్లేపల్లి వైపు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో పెద్దవూర మండలం కేంద్రం లోని గల కాటన్ మిల్లు వద్దకు వెళ్లేసరికి అదే సమయంలో హైదరాబాద్ వైపు నుండివేగంగా వస్తున్న కారు డ్రైవర్ అజాగ్రత్త వలన గోపి, మధు లు వెళ్తున్న మోటార్ సైకిల్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో గోపి, మధు లకు తీవ్ర గాయాలు అయ్యాయి.వారిని నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించాగా గోపి చికిత్స పొందుతూ చనిపోయాడు, మధు ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు హాస్పిటల్ కు తరలించారు. కారు డ్రైవర్ పేరు అవుతు కోటి రెడ్డి, హైదరాబాద్ చెందిన వైక్తిగా తెలిసిందని ఎస్ఐ వీరబాబు తెలిపారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Spread the love