నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్‌ వ్యాన్‌

నవతెలంగాణ – ఉత్తరాఖండ్‌ : ప్రశాంతంగా ఉన్న ఓ ఆస్పత్రిలోకి పోలీసులు వాహనంతో సహా దూసుకువచ్చి.. నిందితుడిని పట్టుకున్నారు. సినిమా సీన్‌ను తలపించే ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలిని వేధించాడు. ఆ నిందితుని చర్యను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది డీన్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టి, నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఆసుపత్రికి తమ వాహనంలో చేరుకున్నారు. ఈ సమయంలో వారు సినిమా తరహాలో వాహనంతో సహా ఆసుపత్రిలోకి దూసుకువచ్చి.. నిందితుడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఇంతకీ పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు వాహనంతో సహా లోనికి ఎందుకు వచ్చారన్నది తెలియాల్సి ఉంది.

Spread the love