ఆరోగ్య ఉప కేంద్రానికి నీధులను మంజూరు చేయాలని వినతి పత్రం అందజేత..

నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తీర్మన్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోపు గోవర్ధన్ అధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ‌‌ డాక్టర్ సుదర్శనంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం లేదని, ప్రస్తుతం గ్రామ పంచాయతీ లో ఒక రూం లో ఉపకేంద్రం కోనసాగుతుందని గ్రామ పంచాయతీలో ఎప్పుడూ ప్రజల రాకపోకలు విపరీతంగా ఉండటంతో మహిళలు, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లల తల్లులు రావాలంటే అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని,ఇదే కాకుండా ఓకే ఒక రూం ఉండటంతో మహిళలు గర్భిణి స్త్రీలు బయటనే ఉండే పరిస్థితులు నెలకొని ఉన్నాయని వేంటనే ఆరోగ్య ఉప కేంద్రం నిర్మించడానికి నీధులను మంజూరు చేయాలని వారు విన్నవించుకున్నారు. అనంతరం డిఎంహెచ్ఒ సానుకులంగా స్పాందించారని గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు తెలిపారు.కలిసిన వారిలో మహేష్,దర్శపు గంగేశ్వర్,  పుట్నల శ్రీనివాస్, వెంకటీ, తెడ్డు అబ్బయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love