పీవీ సింధు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో బోణీ..

నవతెలంగాణ -హైదరాబాద్: భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో బోణీ కొట్టింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెల‌వ‌లేక‌పోయిన ఆమె మ‌హిళ‌ల సింగిల్స్‌ రెండో రౌండ్‌కు చేరింది. 47వ ర్యాంక‌ర్‌ అష్మితా చాలిహ‌పై 21-18, 21-13తో సింధు విజ‌యం సాధించింది. త‌ర్వాతి మ్యాచ్‌లో ఆమె భార‌త్‌కే చెందిన ఆక‌ర్షి క‌ష్య‌ప్‌ను ఢీ కొట్ట‌నుంది. పురుషుల సింగిల్స్ కిదాంబి శ్రీ‌కాంత్, హెచ్ఎస్ ప్ర‌ణ‌య్, ప్రియాన్షు ర‌జావ‌త్ మొద‌టి రౌండ్‌లో విజ‌యం సాధించారు. జ‌పాన్ ఓపెన్‌లో విఫ‌ల‌మైన ప్ర‌ణ‌య్ హాంకాంగ్‌కు చెందిన చెక్ యూను చిత్తు చేశాడు. మూడు సెట్ల‌లో జోరుగా ఆడిన భార‌త ష‌ట్ల‌ర్ 21-18, 16-21, 21-15తో గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మ‌రో మ్యాచ్‌లో 19వ ర్యాంక‌ర్‌ శ్రీ‌కాంత్ జ‌పాన్ ఆట‌గాడైన కెంటా నిషిమొటోపై 21-18, 21-7తో అవ‌లీల‌గా గెలుపొందాడు. యంగ్‌స్ట‌ర్ ప్రియాన్షు వైల్డ్ కార్డ్ ప్లేయ‌ర్ నాథ‌న్ టాంగ్‌పై 21-12, 21-16తో విజ‌యం సాధించాడు.

Spread the love