లోయరు మానేరు డ్యాం నుంచి దిగువకు నీటిని రిలీజ్ చేసిన మంత్రి గంగుల

నవతెలంగాణ- కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయరు మానేరు డ్యాం నుంచి కాకతీయ ద్వారా దిగువకు నీటిని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 500 క్యూసెక్కుల నుంచి 2000 క్యూసెక్కుల వరకు నీటి విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో దిగువన ఉన్న రైతులకు ఉపయోగపడుతుందని నీటిని విడుదల చేస్తున్నామన్నారు. లోయర్ మానేర్ డ్యాంలో ప్రస్తుతానికి 23 టీఎంసీల నీరు ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం దిగువ ఎల్ఎండీ నుంచి 9లక్షల ఎకరాలకు నీటిని రిలీజ్ చేశామని ఆయన అన్నారు. డ్యాం నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వరంగల్ మీదుగా నల్గొండ వరకు 52 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సరిపడా సాగునీరు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పొన్నాల లక్ష్మయ్య ఇక్కడి నుంచి నీటిని తీసుకెళ్లారు.. చివరి వరకు నీరు వదిలే అవకాశం ఉన్నది.. త్వరలోనే ఎగువ మానేరు నుంచి నీటిని వదులుతామని మంత్రి తెలిపారు.

Spread the love