త్వరలో సెట్స్‌పైకి సెన్సేషనల్‌ ప్రాజెక్ట్‌

త్వరలో సెట్స్‌పైకి సెన్సేషనల్‌ ప్రాజెక్ట్‌ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక మార్క్‌ని క్రియేట్‌ చేసుకున్నారు దర్శకుడు వైవీఎస్‌ చౌదరి. దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా అనేక  విజయవంతమైన చిత్రాలను నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు. ‘శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి, సీతారామ రాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన దర్శకుడు వైవిఎస్‌ చౌదరి నుంచి మరో సెన్సేషనల్‌ ప్రాజెక్ట్స్‌ రాబోతుంది. నేడు (గురువారం) దర్శకుడు వైవిఎస్‌ చౌదరి పుట్టిన రోజు. అలాగే ఆయన అభిమాన దర్శకులు, దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరంలోనే ఓ సెన్సేషనల్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు వైవిఎస్‌ చౌదరి. ప్రతిభగల కొత్త నటీనటులతో.. న్యూ ఏజ్‌ యూనిక్‌ కంటెంట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో ఈ ప్రాజెక్ట్‌ ఉండబోతోంది. ఈ సినిమాకి సంబధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Spread the love