కెథడ్రల్ చర్చిలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకల

– గుడ్ ఫ్రైడే విశిష్టతను ఉపదేశించిన ఫాదర్ జోసెఫ్
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో గల మరియరాణి కెథడ్రల్ చర్చిలో శుక్రవారం ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలను నిర్వహించారు. పరిశుద్ధ శిలువ మార్గం నాటక రూపం ద్వారా మరియరాని కెథడ్రల్ చర్చి ఆధ్వర్యంలో  పురవీధులలో ఊరేగింపు చేసుకుంటూ మరియగిరి గుట్టపై ఏసుప్రభువుకు శిలువ వేయడం జరిగింది. కార్యక్రమంలో విచారణ ఫాదర్ తుమ్మ జోసెఫ్ గుడ్ ఫ్రైడే విశిష్టతను ప్రజలకు వివరించి ఉపదేశం చేశారు. ఈ కార్యక్రమంలో విచారణ కౌన్సిల్ సభ్యులు దాసరి శౌరి రాజు, రామినేని కిరణ్, కోరెక్క కిరణ్,గాలి జోజి, ఇటుకలపాటి పవుల్, బాలశౌరి రెడ్డి, లూయిత్ రెడ్డి, మారాను ఆంతోని, పసల బాలశౌరి, మక్కెన ఆరోగ్య రాజు, విచారణ సహాయ గురువు జి. శ్రవణ్, విచారణ క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love