నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సిరిగిరి వెంకటరెడ్డి

నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సిరిగిరి వెంకటరెడ్డి, కార్యదర్శిగా  గిరి లింగయ్య గౌడ్ ఎన్నికయ్యారు. నల్గొండ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ఉత్కంఠ భరితంగా సాగాయి.  ఈ పోటీ లో వారు అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జి.శ్రీనివాస చక్రవర్తి, పులిజాల కార్తిక్, సంయుక్త కార్యదర్శిగా మామిడి ప్రమీల, కోశాధికా రిగా మంచుకొండ రమేశ్, గ్రంథాలయ కార్యదర్శిగా అజ్మీర్ ఖాన్, కల్చరల్ కార్యదర్శిగా బి. నగేశ్, క్రీడల కార్యదర్శిగా సూర రాజశేఖర్, కార్యవర్గ సభ్యులుగా బి. అశోక్, నిమ్మల భీమార్జున్రెడ్డి, మంద నగేశ్, జి. కృష్ణమూర్తి, వెంకట్ రెడ్డి, బ్రహ్మాచారి, నర్సాజీ, సత్తయ్యలు ఎన్నికయ్యారు.
Spread the love