ప్రేమించండి.. క్షమించండి

– డా.హిప్నోపద్మాకమలాకర్ ,జి.కృష్ణవేణి
నవతెలంగాణ-హైదరాబాద్ : నవభారత్ లైన్స్ క్లబ్, డాక్టర్ హిప్నో కమలాకర్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఆధ్వర్యంలో శుక్రవారం భోలక్పూర్ లోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో గుడ్ ఫ్రైడే ను పురస్కరించుకోని విద్యార్థినిలకు పోషకాహారం, స్నాక్స్, గుడ్లు, పుస్తకాలు, పెన్నులు డా.హిప్నో పద్మా కమలాకర్, జి.కృష్ణవేణి, సైకాలజిస్ట్ జ్యోతి రాజా,అస్థిత్వం మంజుల, రాజా నరసింహ పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ డైరెక్టర్, డా.పద్మాకమలాకర్ మాట్లాడారు. గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను పిల్లలకు వివరించారు. ఏసుక్రీస్తు మానవ రూపంలో జన్మించి న మహానీయుడు అన్నారు. ఆయన చూపిన ప్రేమ, దయా, క్షమాపణ గుణం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, జ్యోతిరాజా, రాజా నరసింహ హాస్టల్ వార్డెన్ భానుప్రియా తదితరులు పాల్గొన్నారు.

Spread the love