భారత్‌, చైనాల మధ్య సుస్థిరమైన, శాంతియుత సంబంధాలు అవసరం

నవతెలంగాణ -న్యూఢిల్లీ: భారత్‌, చైనాల మధ్య సుస్థిరమైన, శాంతియుత సంబంధాలు అత్యవసరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. శాంతియుత సంబంధాలు ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా ముఖ్యమని అన్నారు. దౌెత్య, మిలిటరీ స్థాయి చర్చల్లో నిర్మాణాత్మకంగా, సానుకూలంగా ఉంటే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని అన్నారు. ఇరు దేశాలు తమ సరిహద్దుల్లో శాంతియుత, ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించగలవు, కొనసాగించగలవని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన న్యూస్‌వీక్‌ మ్యాగ్జిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. క్వాడ్‌ గ్రూప్‌ గురించి మాట్లాడుతూ.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఇండియా, చైనా దేశాలు అనేక గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నాయని అన్నారు. క్వాడ్‌ ఏ దేశానికి వ్యతిరేకంగా ఉద్దేశించి లేదని, ఎస్‌సిఒ, బ్రిక్స్‌ సహా ఇతర అంతర్జాతీయ సంస్థల్లానే క్వాడ్‌ కూడా ఓ సానుకూల ఎజెండాపై పనిచేసే దేశాల సమూహమని అన్నారు. క్వాడ్‌ సమూహంలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ఉన్నాయి.

Spread the love