సమ్మెకే బీబీసీ జర్నలిస్టుల ఓటు

లండన్‌: బీబీసీ లోకల్‌ రేడియో చానల్‌కి నిర్వాహకులు చేయతల పెట్టిన మార్పులను వ్యతిరేకిస్తూ 48గంటల పాటు సమ్మె నిర్వహించేందుకు అనుకూలంగా ఇంగ్లండ్‌లోని బిబిసి జర్నలిస్టులు ఓటు వేశారని నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (ఎన్‌యూజే) తెలిపింది. జూన్‌ 7, 8తేదీల్లో ఈ సమ్మె జరగనుంది. ”లోకల్‌ రేడియోని లోకల్‌గానే వుంచాలి” అన్న ప్రచారం లో భాగంగా బీబీసీలోని ఎన్‌యూజే సభ్యులు పార్లమెంట్‌ సభ్యులను కలి సి, బీబీసీ జరపతలపెట్టిన మార్పులపై ఒత్తిడి తేవాల్సిందిగా కోరారు. స్థాని క సర్వీసులను ఆధునీకరించాలని బీబీసీ యోచిస్తోందని ఎన్‌యూజే తెలి పింది. ఈ ప్రతిపాదనల వల్ల స్థానిక వార్తలు ప్రజలకు తెలియకుండా పోతా యని పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో కొన్ని రాయితీలు ఇచ్చినా అవి ఏమాత్రమూ సరిపోవని యూనియన్‌ పేర్కొంది. నేషనల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఆర్గనైజర్‌ పాల్‌ సిగర్ట్‌ మాట్లాడుతూ, స్థానిక వార్తలు చాలా కీలక మని, స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేందుకు వీలు కలుగు తుందని అన్నారు. కమ్యూనిటీలని ఒక్క తాటిపై కలిపి వుంచుతుం దని అన్నారు. బీబీసీ బడ్జెట్‌ రీత్యా చూసినట్లైతే లోకల్‌రేడియో అనేది పెద్ద ఖర్చు తో కూడిన వ్యవహారం కాదని అన్నారు. ఈ వివాదాన్ని బీబీసీ చాలా సుల భంగా పరిష్కరించగలదని నమ్ముతున్నామన్నారు. ఎన్‌యుజె ఎన్నికల ఫలి తం పట్ల తాము నిరాశ చెందామని బీబీసీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అయి నా యూనియన్‌తో చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ ప్రణాళికల్లో భాగంగా సిబ్బంది సంఖ్యను తగ్గించడం లేదా నిధుల్లో కోత విధించడం వుండదన్నారు.

Spread the love