అనుమానాస్పదంగా ఉరి వేసుకుని ఓ మహిళ మృతి

నవతెలంగాణ-మర్పల్లి
అనుమానాస్పదంగా ఓ మహిళ ఉరి వేసు కుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మధ్యాహ్నం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మహమ్మద్‌ అక్రమ్‌కు జహీరాబాద్‌కు చెందిన మొహమ్మద్‌ షరీఫ్‌ఖాన్‌ ఐదో కూతురు వహీదాభిను 2019 తేదీన ఇచ్చి వివాహం జరిపించారని వీరికి రెండున్నరేండ్ల కుమారుడు ఉన్నాడని తెలిపారు. వివాహం అనంతరం భార్యాభర్తలు గొడవపడేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం వహీదాభి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసు కోవడంపై అనుమానాలు ఉన్నాయని అక్రమ్‌తో పాటు కుటుంబ సభ్యులే హత్యకు పాల్పడి ఉంటారని మృతురాలు తండ్రి మహమ్మద్‌ షరీఫ్‌ఖాన్‌ ఫిర్యాదులో పేర్కొన్నారని. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్‌ కుమార్‌గౌడ్‌ తెలిపారు.

Spread the love