నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తమ పంజాను విసురుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న అధికారుల భరతం పడుతున్నారు. ప్రజల నుంచి నిత్యం వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి, సదరు అధికారులపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నారు. అదును చూసి ఆకస్మిక తనఖీలు చేపడుతూ ఏసీబీ అధికారులు అవినీతి తిమింగాలల ఆట కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నాంపల్లిలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అదేవిధంగా రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజనీరింగ్ ఆఫీసులలో రాత్రి నుంచి అధికారుల సోదాలు చేపడుతున్నారు. ఈ దాడుల్లో మొత్తం నలుగులు అధికారులను అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ చిక్కిన వారిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్ ఉన్నారు. కాగా, ఓ ఫైల్ అప్రూవల్ విషయంలో మరో అధికారి రూ.2.5 లక్షలు డిమాండ్ చేశాడు. మొదటి దఫాలో రూ.1.5 లక్షలు ముట్టజెప్పిన బాధితుడు, మరో దపాలో రూ.లక్ష ఇచ్చేందకు ఒప్పుకుని ఏసీబీ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం రూ.లక్షకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు 4 గంటలు శ్రమించి సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నారు.

Spread the love