మత ఘర్షణలను రెచ్చగొడుతున్న..మోడీపై చర్యలు తీసుకోవాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ
– రెండు విడతల్లో మోడీ ప్రభుత్వానికి ఎదురుగాలి
– అందుకే ఓ వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు
– మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ స్పందించాలి
– భువనగిరిలో సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
– 16 స్థానాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు మద్దతు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఓడిపోతున్నామన్న భయంతోటే మోడీ మత గర్షణలను రెచ్చగొడుతున్నారని, ఆయనపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన రెండు విడతల్లో మోడీ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోందన్నారు. అందుకే ఓ వర్గాన్ని కించపరి చే విధంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ స్పందించాలని కోరారు. ఈ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించి ప్రజా స మస్యలు పరిష్కరించే భువనగిరి ఎంపీ అభ్యర్థి జహంగీర్‌ని గెలిపించాలని పిలుపునిచ్చారు. భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్‌ ఇబ్రహీంపట్నం నియో జకవర్గంలో నిర్వహించనున్న ఎన్నికల పర్యటనను విజయ వంతం చేసేందుకు సన్నాహక సమావేశాన్ని ఇబ్రహీం పట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రాల్లో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రధాని మోడీ మతోన్మాద ఎజెండాలు తెరమీద చేస్తున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలు మత ఘర్షణలకు తావిస్తున్నాయని చె ప్పారు. ఓ వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయనపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. శ్రామికవర్గంపై ప్రభుత్వానికి ప్రేమ లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రూపంలో రూ.28 లక్షల కోట్ల ఆదాయం సమకూ రిందన్నారు. నిరుద్యోగం పెరిగిందని ఆందోళన వ్యక్తం చే శారు. 40 కోట్ల నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెంప ర్లాడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 28 లక్షల ఖాళీలు భర్తీకి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులు కాలరాస్తు న్నారని చెప్పారు. కనీస వేతనం రూ.28వేలు ఇవ్వాలని చట్టం చెబుతున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 25 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. నిరంకుశవాద, మతోన్మాద మోడీ ప్రభుత్వం దేశంలోని కార్మికుల హక్కులను నాశనం చేసేందుకు ఫాసిస్ట్‌ పద్ధతులను ఉప యోగిస్తుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో కెల్లా అత్యంత అసమానతలు కలిగిన సమాజాల్లో ఒకటిగా మా రుస్తోందని, మరోపక్క ప్రజలను మతపరంగా విభజించేం దుకు విషపూరితమైన తన మతోన్మాద సిద్ధాంతాలను ప్ర యోగిస్తోందని విమర్శించారు. ఆ ప్రయత్నాలకు వ్యతిరేకం గా భారతదేశాన్ని కాపాడేలా ఈ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికలను ఉపయోగించుకొని బీజేపీని,దాని మిత్రపక్షాలను ఓడించడమే ప్రతి దేశభక్తుని కర్తవ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించే సీపీఐ(ఎం) అభ్యర్థి జహాంగీర్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో మిగతా 16 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్‌, యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఈ.నరసింహ, ఆలంపల్లి నరసింహ. టీ టెన్‌ సీఈఓ సుందర్‌, సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కార్యదర్శి ఎల్లెష్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love