అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలి

– నీటి సమస్యకు పరిష్కారం ఏది
– ఎంపీపీ సమావేశంలో సర్పంచ్‌లు
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంలో అక్రమంగా మద్యం, గుడుంబా విక్రయాలు యధేచ్చగా సాగుతున్నా యని వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో డిమాండ్‌ చేశారు. శనివారం సింగరేణి మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మాలోత్‌ శకుంతల అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో అబ్కారీ శాఖ సమీక్ష జరుగతుండగా సర్పంచ్‌లు బానోత్‌ కుమార్‌, బానోత్‌ బన్సీలాల్‌లు కల్తీ మధ్య విక్రయాలపై నిలదీశారు. కల్తీ మద్యం విక్రయాలపై తమ దృష్టి రాలేదని, వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ ఎస్సై దారా వసంత తెలిపారు. గుడుంబా నియంత్రణకు పకడ్బాంధిగా చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికి 30 మందికి పైగా బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యుత్‌ శాఖ సమీక్ష సందర్బంగా విద్యుత్‌ ప్రమాధాలపై ప్రజాప్రతినిధులు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. నీటి ఎద్దటి నివారణకు చర్యలు చేపట్టాలని కోరినా సీతారాంపురం వంటి గ్రామంలో నీటి సమస్య ఉత్పన్నం కావటం పై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. ఈసందర్భంగా ఎంపీపీ మాలోత్‌ శకుంతల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన పథకాలను ఆర్హత కల్గిన వారందరికి అందేలా ప్రతి ఒక్కరు కషి చేయాలని కోరారు. గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. ఈదురు గాలులతో విద్యుత్‌ తీగలు కిందికి వేలాడటంతో వాటిని తాకిన పశువులు మత్యువాతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ వాంకుడోత్‌ జగన్‌, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎం.చంద్రశేఖర్‌, డిప్యూటీ తహాసీల్దార్‌ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love