అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు

– వ్యవసాయ శాఖ అధికారి జై సింగ్, ఎస్ ఐ వెంకటేశ్వరరావు
డీలర్ల సమావేశంలో వెల్లడి
నవతెలంగాణ -తాడ్వాయి
డీలర్లు అనుమతి లేని విత్తనాలు రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ శాఖ అధికారి పోరిక జై సింగ్, స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు లు హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు తో కలిసి మండలంలోని విత్తనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు డీలర్లు తప్పక పాటించాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలన్నారు. ప్రతి డీలర్ తప్పనిసరిగా బిల్ బుక్స్, విత్తన మొలక శాతం రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు తప్పనిసరిగా బిల్ ఇవ్వాలన్నారు. డీలర్లు స్వయంగా తమకు వచ్చిన విత్తనాలను లాట్ ప్రకారం మొలక కట్టి శాతం లెక్కించాలన్నారు. అందులో 80 నుండి 90 శాతం మొలకలు వచ్చినవి మాత్రమే పరిగణలోకి తీసుకొని విక్రయించాలన్నారు. కొనుగోలు చేసే రైతులకు తప్పనిసరిగా లాట్ నెంబర్ తో సహా రసీదు ఇవ్వాలన్నారు. ఆయా రసీదును రైతులు తప్పకుండా జాగ్రత్త చేసుకోవాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో మండల విత్తన డీలర్లు, ఏ ఈ ఓ లు జిజే రవికుమార్, నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love