ఎమ్మెల్యేకు వ్యవసాయ అధికారుల సన్మానం

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని కొడిచెర గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనం సోమవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు మండల వ్యవసాయ అధికారి రాజు కోడిచెర వ్యవసాయ క్లస్టర్ ఏ ఈ ఓ సంయుక్త కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి ఎమ్మెల్యేకు బొకేను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళల అత్తుబాటులో ఉండాలని, రైతు సమస్యలపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పంటలకు అందించవలసిన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.
Spread the love