కీరదోసతో అద్భుత ప్రయోజనాలు..!

కీరదోసతో అద్భుత ప్రయోజనాలు..!కీరదోసను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. దీన్ని తినటంవల్ల వేసవిలో చాలా ఉపశమనం లభిస్తుంది. దీనిని సలాడ్‌గా తినవచ్చు.. చాలా మంది దీనిని రైతాలో చేర్చడానికి ఇష్టపడతారు. దోసకాయలో ప్రోటీన్‌, ఫైబర్‌, విటమిన్‌ సి, విటమిన్‌ కె, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, పొటాషియం మాంగనీస్‌ వంటి అనేక పోషకాలున్నాయి. దోసకాయలో 96శాతం నీరు ఉంటుంది, ఇది శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. హెల్త్‌లైన్‌ నివేదిక ప్రకారం, దోసకాయలు చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. దోసకాయను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. దోసకాయ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దోసకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మన రోజువారీ నీటి అవసరాల్లో 40శాతం పొంద వచ్చు. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలోనూ సహాయ పడుతుంది. మీరు స్థూల కాయంతో బాధపడుతూ, బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న ట్లయితే.. కీరదోసకాయను తప్పని సరిగా తినాలి.
కీరదోసకాయలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. కొవ్వు అస్సలు ఉండదు. అధిక పరిమాణంలో దీనిని తింటే బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Spread the love