అమ్మా ద్రౌపదీ..!

అమ్మా ముర్మూ
చూస్తున్నావా!
ఈ దురహంకారాన్ని
తరతరాలుగా
కొవ్వెక్కిన దుర్మార్గాల్ని

వాడు
ఆదివాసీ జీవనంపైన
ఎంత అనాగరికదాడి
చేసాడో కన్నావా!
కను తల్లీ కను!
కంటేనే కడుపులో
మంట లెగుస్తాయి

అగ్ర కులజుడు చేసింది
నేరమనబడదు అనబడదు
హీనుడు దాన్ని తుడిచేసుకోవాలి
మనువు నుడివిన స్మృతి
ధర్మానుసరులం కదా!

మరిలానే జరుగుతుంది!
అనాదిగా అలానే జరుగుతోంది

నిన్ను అధిపతిని చేసి
వాడి పీఠాన్ని స్థిర పరచుకుంటాడు
నీ కళ్ల ముందే నీ సమూహాన్ని
మూత్రంలా విసర్జిస్తుంటాడు
అమ్మా ద్రౌపదీ ఇకనైనా
వాడి రక్తంతోనే శిఖ ముడుస్తానని
శపథం చేయవా!
లేదా…
వాడి అహంకార
మూత్రాంగాన్ని ఛేదించి
విసర్జనా వివక్షతను ఆపేయవా!

అమ్మా ముర్మూ
మౌనం వీడి రా!
మనువాదం పడగవిప్పుతోంది!
మదమక్కి రంకెవేస్తోంది.
– కె. ఆనందాచారి

Spread the love