ముమ్మరంగా కొనసాగుతున్న ఇంటింటీ ఓటరు సర్వే

– బోగస్‌ ఓట్ల ఏరివేతకు చర్యలు
– ఓటరు జాబితాకు కసరత్తు
– కొత్త ఓటరు నమోదుకు షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ-కొడంగల్‌
ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొడంగల్‌ మండలంలో ముమ్మరంగా ఓటరు సర్వే పనులకు మండల తహసీల్దార్‌ బుచ్చయ్య ఆదేశాలతో బీఎల్వోలు సర్వే కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఒకే ఫోటోతో రెండు ఓట్లుఉన్న వారి జాబితాను సిద్ధం చేసి పరిశీలిస్తుండగా మరోవైపు నూతన ఓటరు నమోదు, ఓటర్‌ కార్డులో మార్పులు చేర్పులు, జాబితాలో పేరు తొలగించుకునే అవకాశం కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు తుదిజాబితా తయారు చేసేందుకు పలు దఫాలుగా బిఎల్‌ వోలతో సర్వేలు చేయిస్తోంది. నూతనంగా ఇచ్చిన ఆదేశాలను అధికారులు వడబోత కార్యక్రమం ద్వారా పూర్తి చేసేందుకు సమయాత్తం అయ్యారు. మృతిచెందిన ఓటరును జాబితా నుంచి తొలగించడం, కొత్త ఓటరును చేర్చడం, అడ్రస్‌ మార్పు లాంటి ప్రక్రియలో భాగంగా కలెక్టర్‌ ఆదేశాలతో మండల తహసీల్దార్‌ బుచ్చయ్య, బీఎల్వోలకు, సిబ్బందికి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారంతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు.
కొడంగల్‌ ఎన్నికల యంత్రాంగం పారదర్శక ఓటరు జాబితాకు కసరత్తు చేస్తోంది. కొత్త ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రతి ఏడాది జనవరిలో జరిగే ఓటరు నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల దృష్ట్యా ముందుగా చేపడుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కొత్తగా ఓటుహక్కు కల్పించనున్నారు.
షెడ్యూల్‌ ఇలా..
ఈనెల 23 వరకు బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటిం టికీ తిరిగి ఓటరు జాబితాను పరిశీలిస్తున్నారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి చనిపోయిన, వలస వెళ్లిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. జూన్‌ 24 నుంచి జూలై 27 వరకు పోలింగ్‌ స్టేషన్లను క్రమబద్ధీకరి స్తారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు మించకుండా పోలింగ్‌ స్టేషన్‌ పరిధి నిర్ణయిస్తారు. జూలై 25 నుంచి 31 వరకు ఓటరు జాబితాకు సంబంధించిన సప్లిమెంట్స్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. పురుషులు, మహి ళలు, జనాభా తదితర వివరాలన్నింటినీ క్రోడీకరిస్తారు.
బోగస్‌ ఓట్ల ఏరివేత
బోగస్‌ ఓట్లను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు, ఓటరు జాబితా రూపకల్పనతో బూత్‌ లెవల్‌ అధికారుల(బీఎల్‌ఓ) పాత్ర కీలకం. బీఎల్‌ఓలుగా పంచాయతీ కార్యదర్శులను, అంగన్‌ వాడీ కార్యకర్తలను నియమించారు. ప్రస్తుతం బోగస్‌ ఓట్ల ఏరివేత కోసం అంగన్‌వాడీలు, పంచాయతీ కార్యదర్శులు సర్వే పనుల్లో నిమగమయ్యారు.
సర్వే పనులు సాగుతున్నాయి
మండలంలో ఓటరు సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. మండలంలో బూత్‌ లెవల్‌ అధికారులచే సర్వే చేయిస్తున్నాం. ఈనెల 23 వరకు సర్వే పనులు పూర్తి చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. వెంటనే పోలింగ్‌ బూత్‌ల క్రమబద్ధీకరణ చేపడతాం.
తహసీల్దార్‌ బుచ్చయ్య,మండల

Spread the love