న్యాల్కల్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి..

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు ఐదవ టౌన్ ఎస్ఐ సాయినాథ్ బుధవారం వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తి పడి ఉండడంతో స్థానికులు టౌన్ కు సమాచారం అందించారని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తిని పరిశీలించగా మృతి చెంది ఉన్నాడని, మృతుడి వయసు 60-65 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టమన్నారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ప్రకారం ఆదిలాబాద్ జిల్లా, మందమర్రి మండలంకు చెందిన కన్కుట్ల రాజయ్య గా అనుమానం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా సదరు వ్యక్తిని గుర్తుపట్టి ఉంటే ఐదవ టౌన్ ను సంప్రదించాలని సూచించారు.

Spread the love