డిచ్ పల్లి లో జూన్ 4 న బహుజన చైతన్య సభ

నవతెలంగాణ – కంటేశ్వర్
డిచ్ పల్లి లో జూన్ 4 న బహుజన చైతన్య సభ పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని జిల్లా ఇంచార్జి గైని గంగాధర్ అన్నారు. మంగళవారం బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూసల గల్లీ లో జిల్లా ఉపాధ్యక్షులు సిలుమల గణేష్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి గైని గంగాధర్ విచ్చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ..జూన్ 4 న డిచ్ పల్లి కేంద్రంలోని ఎస్ ఎల్ జి ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం 3 గంటలకు బహుజన చైతన్య సభ భారీ ఎత్తున నిర్వహించనున్నామని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సభకి ముఖ్యఅతిథిగా రానున్నారని, యువకులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.60 ఏళ్ల సుదీర్ఘ ప్రజా ఉద్యమ ఫలితంగా 1200 మంది అమరులు త్యాగంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశలు ఆశయాలు అడియాశలు అయ్యాయని ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నేటి బి ఆర్ ఎస్ నాయకులైన కేసీఆర్ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి వాటిని విస్మరించడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా నీళ్లు నిధులు నియామకాలు అన్న హామీలను తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలను, నిరుద్యోగులకు అన్యాయం చేశారన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ..మలిదశ ఉద్యమకారుడు, కళాకారుడు 2019 నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి నిరంతర ప్రజా సమస్యలపై కొట్లాడుతూ రూరల్ లో ప్రజలను సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, నిరంతర రం సమస్యల వై కొట్లాడుతూ ప్రజలపక్షంగా పోరాడుతున్న యువ నాయకులు కళా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లిలో బహుజన చైతన్య సభ కు బహుజన సైనికులు తరలిరావాలని రూరల్ లో జరుగుతున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహించ తలపెట్టిన ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమంలో రూరల్ ఇంచార్జి కళ శ్రీనివాస్, బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్రోళ్ల గంగాధర్, రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు పోతే ప్రవీణ్ బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love