పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి

నవతెలంగాణ – కంటేశ్వర్
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లా కార్యవర్గం కోరారు. ఈ మేరకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ సందర్భంగా అనేక వర్గాల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకొచ్చింది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయని, పి ఆర్ సి కమిటీ కాలపరిమితి ముగిసిందని కొత్త పిఆర్సి ని ఏర్పాటు చేయాలని, ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ కూడా తక్షణమే చెల్లించాలని ,ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పటిష్టపరిచి నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్ ,ప్రైవేట్ ఆస్పత్రిలో అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. మొదటి తారీకు నే పించను అందే విధంగా చర్యలు తీసుకోవాలని, కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ను 15 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల కు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పత్రిక విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్మోహన్, కోశాధికారి ఈవిల్ నారాయణ, జిల్లా నాయకులు, జార్జ్ ప్రసాదరావు, రాధా కిషన్, సుదర్శన్ రాజ్ ముత్తారం నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love