రెండోటెస్ట్‌లోనూ లంక గెలుపు

రెండోటెస్ట్‌లోనూ లంక గెలుపు– బంగ్లాతో టెస్ట్‌ సిరీస్‌ 2-0 క్లీన్‌స్వీప్‌
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో, చివరి టెస్ట్‌లోనూ శ్రీలంక జట్టు గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 7 వికెట్ల నష్టానికి 268పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌ జట్టు లంక పేసర్లు లహిరు కుమార, కమింద్‌ మెండిస్‌ల ధాటికి 318 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో రెండోటెస్ట్‌లో శ్రీలంక జట్టు 192 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో సెంచరీలు బాదిన కమిందు మెండిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాటర్లు కుశాల్‌ మెండిస్‌(93), కమిందు మెండిస్‌(92), ధనంజయ డిసిల్వా(70), కరుణరత్నే(86), నిశాన్‌ మధుశనక(57)లు రాణించారు.
స్కోర్లు..
శ్రీలంక : 531, 157/7డిక్లేర్డ్‌ బంగ్లాదేశ్‌ : 178, 318

Spread the love