బీఆర్‌ఎస్‌ వ్యతిరేక రాజకీయ

పునరేకీకరణ : రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ ప్రారంభమైందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన సమక్షంలో కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు.

Spread the love