Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గిరిజన గురుకుల బాలుర కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గిరిజన గురుకుల బాలుర కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ–కాటారం : స్థానిక గిరిజన గురుకుల బాలుర జూనియర్ కళాశాల కాటారంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సోమోజి ఒక ప్రకటనలో తెలిపారు.

ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాంతీయ సమన్వయ అధికారి టి. హరిసింగ్ ఆదేశాల మేరకు ఈ ప్రవేశ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. పదో తరగతి పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు కళాశాల కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -