సీబీఆర్టీ పరీక్షల నిర్వాహణకు పకడ్బందీ ఏర్పాట్లు

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలి
రెవెన్యూ అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ నెల 21, 22వ తేదీల్లో జరుగనున్న సీబీఆర్టీ (ఏ ఈఈ) రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌. తిరుపతిరావు జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా మొత్తం 13 సెంటర్లలో నిర్వహించనున్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (సివిల్‌) పోస్టులకు 21 తేదీన 3,948 మంది 22 తేదీన 4,086 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 10.00 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగే పరీక్షకు అభ్యర్థులు ఉదయం 9.30 గంటల లోపు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే పరీక్షకు అభ్యర్థులు మధ్యాహ్నం 2గంటల వరకు కేంద్రాల వద్దకు చేరుకోవాలని నిమిషం ఆలస్యమైన లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించుటకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చే యాలని తహసీల్దార్లనుఆదేశించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్నటువం టి జిరాక్స్‌ కేంద్రాలను మూసివే యించాలని చెప్పారు. విద్యార్థుల కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని విద్యుత్‌ అధి కారులకు సూచించారు. సురక్షిత తాగునీరు అందజేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతోపాటు తగినన్ని, మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందు బాటులో ఉంచాలని చెప్పారు. అత్యవసర వైద్య సేవలకు ప్రభుత్వ ఆస్పత్రిలో వార్డులు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పరీక్షకు హాజర య్యే అభ్యర్థులు, అలాగే ఇన్విజిలేటర్‌ విధులు నిర్వహించే సిబ్బంది ఎవ్వరూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, క్యాలిక్యూలేటర్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదని చెప్పారు. నిశిత పరిశీలన తదుపరి మాత్రమే పరీక్షా కేంద్రా ల్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. విద్యార్థులు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియమ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు తెలిపారు.

Spread the love