గ్రూప్‌ -1 పరీక్ష సాఫీగా జరిగేలా ఏర్పాట్లు

– జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆదివారం నిర్వహించబోయే గ్రూప్‌-1 పరీక్షలు సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రూప్‌-1 పరీక్షలు, సుపరిపాలన, సాహిత్య దినోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్లకు సరైన శిక్షణ ఇవ్వాలనీ, లైజన్‌ ఆఫీసర్లు, రూట్‌ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండి పరీక్షలను సాఫీగా నిర్వహించాలని సూచించారు. ప్రతి సెంటర్‌ వద్ద పోలీస్‌ కానిస్టేబుల్‌తో పాటు మహిళ అభ్యర్థులను చెక్‌ చేసేందుకు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లను నియమించాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు, సెల్‌ఫోన్లు ఇతర పరికరాలను తీసుకెళ్లేందుకు అనుమ తించకూడదని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు , మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల పరిపాలన, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని సీఎస్‌ ఈ సందర్భంగా తెలిపారు. సుపరిపాలనపై జిల్లా, రెవెన్యూ డివిజన్లలో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసి ప్రజలకు తెలిపేం దుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదివారం జరిగే సాహిత్య దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.జిల్లాల్లో ఉన్న ప్రముఖ కవులు, సాహిత్య వేత్త ల విగ్రహాలకు పూల మాలలు వేసి గొప్పగా గౌరవించా లని కలెక్టర్లను ఆదే శించారు. టెలీకాన్ఫెరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్య దర్శి నవీన్‌ మిట్టల్‌, పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమా ర్‌ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి , టీఎస్‌ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమీషనర్‌ అశోక్‌ రెడ్డి, సాంస్కృ తిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అధికారులు పాల్గొన్నారు.

Spread the love