ఎస్ఎఫ్ఐ పోరాటo ఫలితంగా శ్రీ చైతన్య ఫోర్త్ బ్రాంచ్  సీజ్

నవతెలంగాణ – సిద్దిపేట
అనుమతులు లేకుండా నడిపిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్( ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో స్కూల్ ముందు ధర్నా గురువారం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్. అరవింద్ మాట్లాడుతూ.. పర్మిషన్  లేకుండా శ్రీ చైతన్య ఫోర్త్ బ్రాంచ్ పై చర్యలు తీసుకోవాలని,  అదేవిధంగా స్కూల్ సీజ్ చేయాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. స్కూల్ పర్మిషన్ లేకున్నా శ్రీ చైతన్య పేరుతో లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అనుమతులు లేకున్నా అధికారుల అండదండతో ప్రైవేట్ స్కూల్లో నడిపిస్తున్నారని, వాటిని ప్రజలంతా గమనించి ఆ ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లల్ని చదివించొద్దని కోరారు. ఎంఈఓకు విషయం తెలుపగా, ఆయన వచ్చి పాఠశాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొండం సంజీవ్ కుమార్, సహాయకార్యదర్శి చెప్యాల సంతోష్, ఎస్ఎఫ్ఐ, నాయకులు హరీష్, అక్షయ్, భాను, రఘు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love