పోరాటాల ఫలితమే గిరిజన పోడు రైతులకు పట్టాలు

– పోడు రైతులపై పెట్టిన కేసులు రద్దు చేయాలి
– సీపీఐ(ఎం) వైరా నియోజకవర్గం
ఇన్‌ఛార్జి భూక్య వీరభద్రం
నవతెలంగాణ-ఏన్కూర్‌
దశాబ్దాలుగా పోడు భూములకు పట్టాలు కావాలని కమ్యూనిస్టులు, గిరిజన సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇస్తుందని సిపిఎం వైరా నియోజకవర్గ ఇన్చార్జి భూక్య వీరభద్రం తెలిపారు. సిపిఎం ఏన్కూరు మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంపీటీసీ సభ్యులు భూక్య లక్ష్మానాయక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూక్య వీరభద్రం మాట్లాడుతూ సిపిఎం ఇతర వామపక్ష, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమం సమరశీల పోరాటాలు నిర్వహించిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి పోడు భూములు సాగు చేస్తున్న రైతులందరికీ పట్టాలిస్తామని భూములు సర్వే చేసి నేడు గిరిజనులకే పరిమితం చేయటం సరైనది కాదని, గిరిజనులతో పాటు పేదలైన గిరిజనేతరులు కూడా హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పోడు భూములు సాగు సందర్భంగా అటవీశాఖ అధికారులు రైతులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీ చేయకుండా కాలయాపన చేయటంతో రైతుల అప్పులు బ్యాంకులలో వడ్డీలతో అప్పులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, గార్ల ఒడ్డు సొసైటీ వైస్‌ చైర్మన్‌ రేగళ్ల తిరుమలరావు, మండల పార్టీ నాయకులు ఏర్పుల రాములు, ఇటికల లెనిన్‌, ఏన్కూర్‌ గ్రామ శాఖ కార్యదర్శి బుచ్చాల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌ బండ్ల చిన్న జోగయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love