ఆశ కనీస వేతనం 18000 చెల్లించాలి

CITU– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అడప సంతోష్
నవ తెలంగాణ- కాటారం
ఆశాల సమస్యలు పరిష్కరించి కనీస వేతనం 18000 చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అడప సంతోష్ డిమాండ్ చేశారు. ఆశాల సమస్యల పరిష్కారం కొరకు సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక ఆశల సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నారని, ప్రజలను అనేక రకాల చైతన్యవంతులు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన అనేక ట్రైనింగ్లలో ట్రైనింగ్ తీసుకున్నారని, రిజిస్టర్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ పనిచేయడం, బీపీ షుగర్ థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. గర్భిణీలకు బాలింతలకు చిన్నపిల్లలకు అనేక సేవలందిస్తున్నారని అన్నారు. ఒకవైపు పని భారం పెరగడం మరోవైపు నిత్యవసరదారులు పెరుగుతున్నాయని ఈ పరిస్థితుల్లో వచ్చే జీతాలు సరిపోక ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. .ఆశాలకు పని భారం తగ్గించాలి, జాబ్ చార్ట్ ను విడుదల చేయాలని అన్నారు. కేంద్రం చెల్లించిన కరోనా అలివేన్స్ నెలకు రూ.1000 చొప్పున 16 నెల బకాయిలకు వెంటనే చెల్లించాలని అన్నారు. క్వాలిటీతో కూడిన ఐదు సంవత్సరాల పెండింగ్ యూనిఫార్మ్స్ ను వెంటనే ఇవ్వాలని తెలిపారు. ఆశాలకు ప్రసూతి సెలవుల పైన సర్కులర్ వెంటనే జారీ చేయాలని అన్నారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం పోస్టులలో అర్హత ఉన్న ఆశలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డు, ప్రమాద బీమా, రిటర్మెంట్ బెనిఫిట్స్, పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, పద్మ, రూపా దేవి, శైలజ, సంధ్య, స్వరూప రాణి, సుజాత, అంజు, లతా లలిత తదితరులు పాల్గొన్నారు

Spread the love