అందం మీ సొంతం

Beauty is yoursఅందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే దాని కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోని కొన్ని వస్తువులను కూడా ఉపయోగించి అందంగా తయారవ్వొచ్చు. అందుకోసం చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చాలు…
– ముందుగా ఏదైనా ఫేస్‌ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తటి టవల్‌తో తుడుచుకోవాలి. తర్వాత ముఖాన్ని స్క్రబ్‌ చేయాలి. అందుకోసం ఓ చెంచా తేనెలో, చెంచా చక్కెర కలిపి బాగా రాయాలి. అవసరాన్ని బట్టి నిమ్మరసం రెండు చుక్కలు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమంతో ముఖాన్ని స్క్రబ్‌ చేసుకుని, కొద్దిసేపయ్యాక నీటితో కడిగేస్తే సరి.
– చెంచా చొప్పున శెనగపిండి, పాలపొడి, పాలు లేదా రోజ్‌ వాటర్‌ రెండు చెంచాలు తీసుకోవాలి. చిన్న గిన్నెలోకి చెంచా శెనగపిండి, చెంచా పాలపొడి తీసుకుని కలుపుకోవాలి. కొద్దికొద్దిగా రోజ్‌ వాటర్‌ వేసుకుని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పదిహేను నిమిషాలు అయ్యాక కొన్ని నీళ్ళు చల్లి నెమ్మదిగా రుద్దుతూ చల్లని నీటితో కడిగేయాలి.
– ప్యాక్‌ తీసేసాక అలోవేరా జెల్‌తో రెండు నిమిషాలు మసాజ్‌ చేసి, శుభ్రం చేసుకుంటే సరి..
ముఖంలో వచ్చిన తేడాను మీరే గమనించొచ్చు. కేవలం శనగపిండే కాదు.. ముల్తానీ మట్టి, బియ్యంపిండి ఇలా ఏదైనా కలుపుకోవచువచ. పాలకి బదులు నచ్చిన పండు రసాన్ని కలిపితే అదనపు అందం మీ సొంతం.
ఇట్ల చేద్దాం
ఉల్లిపాయకు గుజ్జు మరింత రుచిగా కావాలంటే… ఒక ఫోర్క్‌కు ఉల్లిపాయను గుచ్చి స్టవ్‌ మీద సన్న మంట మీద డైరెక్ట్‌గా కాల్చాలి. పూర్తిగా అన్నివైపులా కాలిన తర్వాత తొక్కను తీసేసి, మిక్సీలో వేసి రుబ్బుకుంటే సరి.. ఇలా చేసిన గుజ్జు గ్రేవీ కూరల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

Spread the love