పాల్వాయిగేటు ఎన్నికల సిబ్బందిపై వేటు..

నవతెలంగాణ – హైదరాబాద్ : మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల(M) పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రం పీవో, సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. పోలింగ్ రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తున్నా అడ్డుకోకపోవడం సీసీ ఫుటేజీలో రికార్డయింది. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్వోని EC ఆదేశించింది. కాగా MLA పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Spread the love