నవతెలంగాణ-కర్నూలు: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ తాజా హెల్త్ బులిటెన్‌ను కర్నూలు విశ్వభారతి వైద్యులు విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆమెను శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. లక్ష్మమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈరోజు లక్ష్మమ్మను డిశ్చార్జ్ చేశాం. గుండె సంబంధిత చికిత్స కోసం వేరే ఆస్పత్రికి రిఫర్ చేస్తాం అని వైద్యులు ప్రకటించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించనున్నారు. లోబీపీ, గుండెపోటుకు గురై ఈ నెల 19వ తేదీన ఆమె కర్నూలు విశ్వభారతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.