నవతెలంగాణ – బల్మూరు
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని శ్రీ ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొండనాగులలో ప్రిన్సిపాల్ రవి పరంగి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా “డిజిటల్ లెర్నింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్ వినియోగం” అనే అంశంపై కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. జాన్ బాబు, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. చాట్ జిపిటి, గూగుల్ జెమినీ, నానో బనానా, పెర్ ప్లక్ సిటీ, కన్వా, క్లూడ్ వంటి అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. కార్యక్రమంలో డా. డుప్ సింగ్, డా. ఆర్. వెంకటయ్య, డా. అశోక్, డా. లక్ష్మ గౌడ్, డా. కృష్ణ గోపాల్, డా. ఈశ్వర్‌లాల్, గోపాల్, గాయత్రి, ముమ్తాజ్, వెంకటస్వామి, అధ్యాపకేతర సిబ్బంది నరసింహరావు, నరసింహ, శివమ్మ, ఆనంద్, ఫర్జానా, లలిత, చాంద్ బీ, రేణుక, అంజనేయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఏ ఐ టూల్స్ వినియోగంపై డిగ్రీ విద్యార్థులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



